సాధువు – కల్ప వృక్షం

Durga
 ఒక సాధువు ప్రయాణమైపోతూ, ఎండలో నడిచినందువల్ల అలసి ముచ్చెమటు పట్టగా కాసేపు విశ్రమించాలని ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ చెట్టుకింద ఎంతో చల్లగా ఉంది. కొంచెంసేపయ్యాక అక్డ నిద్రపోవటానికి తనకొక పాన్పు లభిస్తే ఎంత సుఖంగా వుంటుందో అని ఊహించసాగాడు. అతడు కూర్చున్నది కల్పవృక్షం నీడలో అతడి ఊహలో కోరిక మెదలగానే అతడి పక్కన ఒక చక్కని పానుపు అమర్చబడింది. దాన్ని చూసి ఎంతో ఆశ్ఛర్యపోయి దానిమీద పడుకొన్నాడు. ఆ తరవాత ఒక సుందరాంగి వచ్చి సుతిమెత్తగా తన పాదాలను ఒత్తితే ఎంత హాయిగా ఉంటుందో కదా ! అనుకొన్నాడు. ఈ తలవుకలగగానే నిజంగానే ఒక సుందరాంగి వచ్చి తన పాదాలను ఒత్తుతుండం కనుగొని సాధువు పరమానందభరితుడయ్యాడు. ఆ తర్వాత అతడికి విపరీతమైన ఆకలి వేసింది. అప్పుడు అతడిలా ఊహించాడు. నాకు మంచి ఆహారం లభిస్తే బాగండు అనుకొన్నాడు. మరుక్షణంలోనే అతడి ముందు రకరకాలైన రుచికర పధార్థాలు పిండి వంటలు వడ్డించబడడ్డాయి. సంతోషంతో వెంటనే వాటిని ఆరగించసాగాడు. తృప్తిగా తిన్న తరువాత, పరుపుమీద పడుకొని ఆ రోజు జరిగిన సంఘటనల్నీ నెమరువేసుకోసాగాడు. అలా చేస్తూ చటుక్కున ఇప్పుడు హఠాత్తుగా నన్నొక పులి వచ్చి గుటుక్కున మింగితే ! అని ఊహించాడు. మరుక్షణంలోనే గాండ్రుమంటూ ఒక పెద్దపులి అతడి మీదకు ఉరికి మెడను పంజాతో కొట్టి రక్ము తాగి చంపివేసింది. ఆ సాధువు ప్రాణాలు కోల్పోయాడు. సామాన్యంగా కీర్తి గౌరవాలను వాంఛించి భగవంతుణ్ణి ప్రార్థించే పక్షంలో మీ కోరికలు కొంతమేరకు తప్పక పలిస్తాయి, కాని వాటి వెనుకే ఒక పెద్దపులి దాగివుందని జ్ఞాపకం వుంచుకోవాలి. రోగం, శోకం,ధననష్టం, మానహాని మొదలైన యి పెద్దపులులు సజీవమైన పులుల కంటే వెయ్యి రెట్లు భయంకరాలని మనము తెలుసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: